400 గ్రామాలకు 400 కోట్ల రూపాయలు, 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో లక్ష కోట్ల ఆర్థిక వ్యవస్థ, భారీ నైపుణ్యత శిక్షణ కేంద్రం, భావి వ్యాపారవేత్తలకు చేయూత

మన కాకినాడ లోక్‌సభ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం దక్కటం మన ప్రియతమ నాయకుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన బాధ్యతగా భావిస్తున్నాను. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి నేను సదా కట్టుబడి ఉన్నాను

ఈ వెబ్సైట్లో, మీరు సునీల్ అన్న నేపథ్యం, ఆయన ప్రస్థానం, ప్రాంత భవిష్యత్తు కోసం ఆయన ఆలోచనా విధానం మరియు ఆయన ముఖ్య ప్రాధాన్యతల గురించి తెలుసుకోగలరు. ముఖ్యంగా కాకినాడ అభివృద్ధి కోసం ఆయన ప్రజల ముందుకు తీసుకు వస్తున్న స్వంత మేనిఫెస్టో గురించి తెలుసుకోగలరు.

ప్రాధాన్యతలు

మన నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం నేను రూపొందించిన ప్రణాళికను అనుసరించి కొన్ని కీలక ప్రాధాన్యతలను గుర్తించాను.

01
400 గ్రామాలకు 400 కోట్ల రూపాయలు

మన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 400 గ్రామాలను దత్తత తీసుకొని అక్కడి ప్రాధాన్యతలను బట్టి గ్రామానికి కోటి రూపాయలు చొప్పున రాబోయే ఐదేళ్లలో 400 కోట్ల రూపాయలను ఖర్చు చేసి అభివృద్ధి చేస్తానని వ్యక్తిగతంగా హామీ ఇస్తున్నాను.

02
40 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో లక్ష కోట్ల ఆర్థిక వ్యవస్థ

మా స్వంత సంస్థల ద్వారా చేయబోతున్న పెట్టుబడిని కొలమానంలా చూపించి దేశ విదేశాల నుండి 40 వేల కోట్ల రూపాయలను ఆకర్షించి పోర్టులు, పెట్రోలియం, వ్యవసాయం, మత్స్యకార, పర్యాటక రంగాలలో పరిశ్రమలు నెలకొల్పి తద్వారా కాకినాడ ప్రాంతాన్ని హాంగ్ కాంగ్, సింగపూర్ లతో పోటీ పడగలిగే లక్ష కోట్ల ఆర్థిక వ్యవస్థలా తయారు చేసే ప్రయత్నం చేస్తానని హామీ ఇస్తున్నాను.

03
భారీ నైపుణ్యత శిక్షణ కేంద్రం

అర్హులైన యువతీ యువకులే కాదు, తమ వృత్తులలో ఎదుగుదల లేక నిలచిపోయిన మధ్య వయస్కులకు కూడా సరైన శిక్షణను ఇప్పించి ఈ ప్రాంతంలోనే కాక అభివృద్ధి చెందిన దేశాలలో కూడా ఉపాధి లభించేలా సంవత్సరానికి కనీసం 5000 మందిని తయారు చేసే నైపుణ్యత కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తున్నాను

04
భావి వ్యాపారవేత్తలకు చేయూత

గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజానీకంలో, ముఖ్యంగా మహిళలలో వ్యాపారం చేసే ఆలోచనలు కలిగి, ఆర్థికంగా వెసులుబాటు లేక ఇంటికి పరిమితమైన వారిని ప్రోత్సహించి, గెలిచే మార్గాన్ని చూపి, వారికి అవసరమైన పెట్టుబడిని సమకూర్చి, వారిని భవిష్యత్తు బిజినెస్ లీడర్లలా తయారుచేసే స్టార్ట్-అప్ ఫండ్ ను పరిశ్రమల సహకారంతో ప్రారంభిస్తానని హామీ ఇస్తున్నాను.

విజ్ఞప్తి

ఢిల్లీలో మా ప్రతినిధి చలమలశెట్టి సునీల్ అని కాకినాడ ప్రజలు సగర్వంగా చెప్పుకునేలా నా సర్వశక్తులనూ ఉపయోగించి పని చేస్తాను. ఆ అవకాశాన్ని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి నాకు ఇవ్వమని సవినయంగా కోరుతున్నాను.

సిద్ధం !

అందరి కోసం మెరుగైన సంఘాన్ని సృష్టించడంలో నాతో చేరండి!

Scroll to Top